ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:37 PM
గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలి పారు. ప్రతి గ్రామానికి పక్కారోడ్డు వేయనున్నట్లు చెప్పారు. మంగళవారం మండలంలోని వెంకటాపురం, గంగాధరపేటలో సీసీ రోడ్లు, తాగునీటి పఽథకాలు ప్రారంబించారు.
టెక్కలి రూరల్, జనవరి,13 (ఆంధ్రజ్యోతి): గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలి పారు. ప్రతి గ్రామానికి పక్కారోడ్డు వేయనున్నట్లు చెప్పారు. మంగళవారం మండలంలోని వెంకటాపురం, గంగాధరపేటలో సీసీ రోడ్లు, తాగునీటి పఽథకాలు ప్రారంబించారు.వెంకటాపురంలో కోటీ 53 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డుతో పాటు 13.70 లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పఽథకాలను ప్రారంభించారు. గంగాధరపేట గ్రామానికి కోటీ 17 లక్షలతో వేసిన సీసీరోడ్డుతో పాటు తొమ్మిది లక్షలతోపాఠశాలకు నిర్మించిన ప్రహరీని ప్రారంభించారు.కార్యక్రమంలో ఏఎంసీ చెర్మన్ బగాది శేషగిరిరావు, పినకాన అజియ్‌కుమార్, రాము పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
కోటబొమ్మాళి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే మారు మూల గ్రామాల అభివృద్ధి సాధ్యమని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పి స్తామని చెప్పారు. మంగళవారం మండలంలోని నిమ్మాడ-సాలిపేట గ్రామాల మధ్య రహదారి, సాలిపేటలో సీసీ రోడ్డు, హరిశ్చంద్రపురంలో జలజీ వన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు, చిన్నహర్చింద్రపురం- బాపన్నపేట, బాపన్నపేటలో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. చిన్న హరిశ్చంద్రపురం- వెంకటాపురం రహదారిలో మిని వంతెన, హరిశ్చంద్రపురం- బాపన్నపేట రహ దారిలో మినివంతెన, చిన్నహరిశ్చంద్రపురం నుంచి స్మశాసనవాటికకు రహదా రి పనులకు, హరిశ్చంద్రపురం- వింజాంపాడు గ్రామాలకు తారురోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. హరిశ్చంద్రపురం, కొత్తపేట పంచాయతీలో పారిశుధ్య పనులకు రెండు ట్రాక్టర్లను ప్రారంభించి ఆయా పంచాయతీలకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీవో ఫణీంద్రకుమార్, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, పీఏసీస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు బోయిన రమేష్, శైలజ, సత్యనారాయణ, హనుమంతు శేషగిరి పాల్గొన్నారు.
ప్రతి కుటుంబంలోని ఆనందం వెల్లివిరియాలి
టెక్కలి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ప్రజలకు భోగీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతి కుటుంబం ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భోగీ అనేది వ్యవసాయ సంస్కృతికి ప్రతీకగా రైతు జీవితంలో విడదీయరాని పండుగగా నిలిచిందని పేర్కొన్నారు