సాకారమైన ‘బాట’
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:38 PM
Relief for ‘Kothapeta’ Road వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోడ్డుపై ప్రయా ణించాలంటే ప్రజలు భయపడేవారు. రెండు దశా బ్దాలుగా మరమ్మతులకు నోచుకోక, చిన్నపాటి వర్షానికి రోడ్డు అంతా అధ్వాన్నంగా తయారయ్యేది. గుంతల మయమైన ఆ రహదారిపై రాకపోకలు సాగించలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
‘కొత్తపేట’ రహదారికి మోక్షం
హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
ఎచ్చెర్ల, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోడ్డుపై ప్రయా ణించాలంటే ప్రజలు భయపడేవారు. రెండు దశా బ్దాలుగా మరమ్మతులకు నోచుకోక, చిన్నపాటి వర్షానికి రోడ్డు అంతా అధ్వాన్నంగా తయారయ్యేది. గుంతల మయమైన ఆ రహదారిపై రాకపోకలు సాగించలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ఆ రోడ్డుకు మోక్షం కలిగింది. ఎచ్చెర్ల మండలం తోటపాలెం జంక్షన్ నుంచి సైలాడపేట, కొత్తపేట మీదుగా అంబేడ్కర్‌నగర్ వరకు 5.2 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రూ.3కోట్ల నిధులతో
2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి కేవలం 25 శాతం లోపు పనులు పూర్త య్యాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసింది. కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడం రహదారి మరింత అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణం చేసేందుకు ప్రజ లు ఇబ్బందులు పడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రహదారి నిర్మాణం చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాబార్డు నుంచి రూ.2.99 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ప్రస్తుతం 90 శాతా నికిపైగా పనులు పూర్తయ్యాయి. సైలాడపేట, కొత్త పేట, కోదువానిపేట, గాడుపేట, అంబేడ్కర్‌నగర్ తది తర గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మిగిలిన పనులు కొద్దిరోజు ల్లోనే పూర్తిచేస్తామని ఏఈ పోలినాయుడు తెలిపారు.