రిమ్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:33 AM
ప్రభుత్వ స ర్వజన ఆసుపత్రి (రిమ్స్) చరిత్రలో సరికొత్త అధ్యా యం ప్రారంభమైందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
రూ.4.5 కోట్లతో ఆసుపత్రిలో పరికరాల ఏర్పాటు
రోగులు చిరునవ్వుతో బయటకు వెళ్లాలి
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స ర్వజన ఆసుపత్రి (రిమ్స్) చరిత్రలో సరికొత్త అధ్యా యం ప్రారంభమైందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం నగ రంలోని జీజీహెచ్ సమావేశ మందిరంలో ఇండి యన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రూ.4.5 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేయ నున్న వైద్య పరికరాలకు సంబంధించిన ఎంవో యూను జీజీహెచ్ అధికారులతో కలిసి పరస్పరం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారని, గతేడాది సమీక్ష సమావేశంలో తెలుసుకుని నివేదిక సిద్ధం చేశామన్నారు. దానికి అనుగుణంగానే ఆసుపత్రికి అవస రమైన 38 రకాల వైద్య పరికరాలను అంద జేసేందుకు ఐఓసీఎల్ అంగీకరించిందని, ఈ సంద ర్భంగా ఐఓసీఎల్ చైర్మన్ అరవింద్ సాహ్నికి కృతజ్ఞతలు తెలిపారు. 12 వివిధ వైద్య విభాగాలకు చెందిన 38 నూతన పరి కరాలను రెం డు నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో రోగులకు అధునాతన వైద్యసేవలను అందుతాయన్నారు. ఈ పరికరాలు 5 నుంచి 10 ఏళ్లు పనిచేసేలా వైద్యులు, సిబ్బంది పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే రోగులు చిరునవ్వుతో తిరిగి ఇళ్లకు వెళ్లేలా చూడాల న్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తరువాత జీజీహెచ్‌పై దృష్టి సారించి జిల్లాలోనే నెంబర్‌వన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. ఆసుపత్రి పరిసరాలు పచ్చదనంతో, ఆహ్లాద కరం గా, ఆకర్షణీయంగా తయారు చేసేందుకు మరో రూ.81 లక్షలు కూడా అందించామని, నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేసి ఆసుపత్రిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఐఓసీఎల్ ఈడీ విభూతి ప్రధాన్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా 600 ఇటువంటి ప్రాజెక్టులు చేప డ తామని, అయితే శ్రీకాకుళం వంటి ప్రాంతంలో నిజ మైన పేద ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టడం ఆనందంగా ఉందని, ఇందుకు కేంద్రమంత్రికి రుణపడి ఉంటామన్నారు. మరిన్ని ప్రాజెక్టులు అందించేందుకు భవిష్యత్తులో సహకరి స్తామన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడు తూ.. ఇది ఒక చారిత్రాత్మకమైన రోజని, పేద ప్రజల కళ్లల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా నిర్ణీ త కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, అందరి స హకారంతో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి రూ.4.5 కోట్ల ప్రాజెక్టులో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంద న్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెం డెంట్ లుకలాపు ప్రసన్నకుమార్, ఏఐసీఎల్ ఈడీ పీయూష్ మిట్టల్, జీజీహెచ్ వైద్యులు, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.