Share News

క్షుద్రపూజల కలకలం

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:33 AM

డి.గొనపపుట్టుగ గ్రామ సమీపం లో శనివారం క్షుద్ర పూ జలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు చెల్లమ్మచెరువు నుంచి నీలాపుపుట్టుగకు వెళ్లే రో డ్డుపై శ్మశానానికి కూత వేటు దూరంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గుర్తించారు.

క్షుద్రపూజల కలకలం

  • ఆందోళనలో డి.గొనపపుట్టుగ గ్రామస్థులు

కవిటి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): డి.గొనపపుట్టుగ గ్రామ సమీపం లో శనివారం క్షుద్ర పూ జలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు చెల్లమ్మచెరువు నుంచి నీలాపుపుట్టుగకు వెళ్లే రో డ్డుపై శ్మశానానికి కూత వేటు దూరంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ రోడ్డుపై రంగులతో వేసిన బొమ్మలు, కపాలం బొమ్మలతో పాటు గడ్డితో తయారుచేసిన బొమ్మలకు రంగులు వేసి పూజలు చేశారు. ఎదురెదురుగా కూర్చునేందుకు వీలుగా క్లాత్‌లు వేసి ఉన్నాయి. రెండు రోజులుగా ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం ఆ రోడ్డులో వెళ్లిన కొందరు స్థానికులు వీటిని గుర్తించి గ్రామస్ధులకు సమాచారం ఇచ్చారు. చలికాలం కావడంతో సాయంత్ర మైతే చాలు గ్రామాల్లో అందరూ ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ఉదయం కూడా ఎండ వేడి వస్తే తప్ప బయటకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం అమావాస్య ఏర్పడనున్న సమయం లో ముందస్తుగా ఇలాంటి పనులు చేశారా అని భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. సంక్రాంతి సందడిలో అందరూ ఉన్న తరు ణంలో రాత్రి వేళల్లో ఇలాంటి చర్యలతో గ్రామస్థులు ఉలికిపడ్డారు. గ్రామంలో గ తంలో ఇలాంటి సంఘ టనలు ఎప్పుడూ జరగలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ విషయం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ కావడంతో ఈ పనికి కొందరు యూ ట్యూబర్లు పాల్పడ్డారని, షూటింగ్‌ కోసం ఇలా చేసి వాటిని శుభ్రత చేయకుండా విడిచిపెట్టారని వాయిస్‌ మెసేజ్‌లును వాట్సాప్‌లో ఆయా గ్రామస్థుల గ్రూప్‌లోకి పంపించారు. దాంతో గ్రామస్థులు కొంతమేర ఉపశమనం పొందారు.

పూజలు నిర్వహించేలా వేసిన ఆకారం

Updated Date - Jan 18 , 2026 | 12:33 AM