వైసీపీకి భారీ షాక్
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:18 AM
ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పొందూరు, బూర్జ మండలాల నుంచి బుధవారం ఆ పార్టీకి చెందిన సుమారు 380 మంది రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
టీడీపీలోకి పొందూరు, బూర్జ మండలాల్లో చేరికలు
పొందూరు/బూర్జ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పొందూరు, బూర్జ మండలాల నుంచి బుధవారం ఆ పార్టీకి చెందిన సుమారు 380 మంది రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వారికి ఎమ్మె ల్యే కూన రవికుమార్ పొం దూరు, పెద్దపేటల్లో పార్టీ కండు వాలు వేసి ఆహ్వానించా రు. పొందూరులో వైసీపీ నాయకుడు పైడి రాజ గోపాల్, నామినేషన్ విత్‌డ్రా చేసుకుని రాజీ నామా చేసిన పైడి రాధతో పాటు 100 మంది, బూర్జ లో 280 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమా ల్లో మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ, టీడీపీ పొందూరు మండల అధ్యక్షుడు సీహెచ్ రామ్మోహన్, రెండు మండలాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.