Share News

తప్పిన పెను ప్రమాదం

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:39 PM

కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు వద్ద జాతీయరహదారి సర్వీస్‌ రోడ్డుపై బుధవారం సాయంత్రం వ్యాన్‌ బోల్తా పడిన ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి.

తప్పిన పెను ప్రమాదం
ఘటనా స్థలంలో క్షతగాత్రులు

  • వ్యాన్‌ బోల్తా.. ఏడుగురికి గాయాలు

ఎచ్చెర్ల రూరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు వద్ద జాతీయరహదారి సర్వీస్‌ రోడ్డుపై బుధవారం సాయంత్రం వ్యాన్‌ బోల్తా పడిన ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హైవే నిర్వహణ, పారిశుధ్య కార్మికులు వ్యాన్‌లో స్వగ్రామా లైన శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురం, భైరి గ్రామాలకు వెళుతుండగా వ్యాన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో వ్యాన్‌లో 30 మంది వరకు ఉన్నారు. ఈ ప్రమాదంలో పున్నయ్య అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు కాగా చికి త్స కోసం ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు రిమ్స్‌ వైద్యులు రిఫర్‌ చేయగా.. క్షతగాత్రుని బంధువులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించా రు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా వైద్యులు చికిత్స అంద జేస్తున్నారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో పరిమితికి మించి ప్రయా ణికులు ఉన్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేక పోవడంతో ఊపిరి పీల్చుకు న్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్‌, జాతీయ రహదారి పెం ట్రోలింగ్‌ వాహనాల్లో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరిలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఔట్‌పోస్టు పోలీసులు ఆస్పత్రి వర్గాల నుంచి వివరాలు సేకరించి ఎచ్చెర్ల పోలీసులకు అందజేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:39 PM