బతికున్న వ్యక్తినే కాగితాలపై చంపేశారు
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:55 PM
వైసీపీ అంటేనే గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ అధినేత జగన్ ఆధ్వ ర్యంలో నాయకుడు మొదలుకొని చిట్టచివరి కార్యకర్త వరకు భూ కబ్జాలు, దాడులు, అత్యాచారాలకు పాల్పడ్డారని ఆమదా లవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవి కుమార్ ధ్వజమెత్తారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైసీ పీ అధినేత జగన్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుల అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
నకిలీ పత్రాలతో మాజీ స్పీకర్ తమ్మినేని భూకబ్జా
కొడుకును రక్షించుకునేందుకు మరొకరిని బలిచేసే యత్నం చేసిన మాజీ మంత్రి అప్పలరాజు
ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ వ్యాఖ్యలు
శ్రీకాకుళం, జూలై 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ అంటేనే గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ అధినేత జగన్ ఆధ్వ ర్యంలో నాయకుడు మొదలుకొని చిట్టచివరి కార్యకర్త వరకు భూ కబ్జాలు, దాడులు, అత్యాచారాలకు పాల్పడ్డారని ఆమదా లవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవి కుమార్ ధ్వజమెత్తారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైసీ పీ అధినేత జగన్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుల అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు..
అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ, నీతులు వల్లించి ప్రతిపక్షాలను పురుగులకన్నా హీనంగా చూసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ పదవికే కళంకం తెచ్చారని విమర్శించారు. బతికున్న వ్యక్తిని కాగితాలపై చంపేశారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన జీవిం చే హక్కును కాలరాసి ఆస్తుల కోసం ఏకంగా నకిలీ పత్రాలు సృష్టించడం తమ్మినేనికి అలవాటుగా మారింద న్నారు. ‘ఫేక్ అడబాల రజని’ని ‘అంధవరపు రజని’గా మార్చి సుమారు రూ.4 కోట్ల విలు వైన భూమిని అన్యా యంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ కబ్జాలో సీతారాం అసలు సూత్రధారి కాగా అతడి కుమారుడు పాత్రధారి అని విమర్శించారు. నకిలీ పత్రాలతో ఇసుక తవ్వకాల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిం చారు. నకిలీ సర్టిఫికెట్లతో కబ్జాలు చేయమని శాసనసభ మీకు అధికారం ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఈ అక్రమా లకు అడ్డుపడిన తన కళాశాల లో పనిచేస్తున్న అమా యక ఫ్యాకల్టీని బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పలరాజు వల్లే కేసు తారుమారు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ కేసు వ్యవహారంపైనా ఎమ్మెల్యే రవి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా రాజ్యాంగ మౌలిక సూత్రాలు పాటిస్తానని ప్రమాణం చేసిన అప్ప లరాజు.. సొంత కొడుకును తన కడుపులో దాచుకునేం దుకు మరో తల్లి కడుపులో మంట పెట్టారని విమర్శిం చారు. రోడ్డు ప్రమాదం తర్వాత కొన ఊపిరితో ఉన్న వ్యక్తినికి ఆస్పత్రికి తీసుకు వెళ్లాల్సిన కనీస బాధ్యతను విస్మరించారన్నారు. అసలు నిందితుడైన తన కొడుకు స్థానంలో.. ఆ ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని బ్రాహ్మణ కులానికి చెందిన మరొక అమాయక యువ కుడిని ప్రవేశపెట్టి కేసును తప్పుదోవ పట్టించడం అన్యాయం కాదా అని నిలదీశారు. గతంలో ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ పీఏ ఇంట్లో రూ.వంద కోట్లు దొరికినప్పుడు జగన్, ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 2019-24 మధ్య 64 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతై చనిపోతే ఒక్క రూపాయి కూడా సాయం చేయని జగన్.. ఇప్పుడు పరామర్శలకు వెళ్లడం ద్వంద్వ విధానం కాదా అని ప్రశ్నించారు.
చట్టం తన పని తాను చేస్తుంది
అప్పట్లో తమ్మినేని సీతారాం ‘జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి’ అన్నారు కానీ నిజంగా ఇప్పుడు ధర్మ రథ చక్రాలు వచ్చాయి. శ్రీకృష్ణుడి లాంటి చంద్రబాబు నా యుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. వైసీపీ నాయకులు ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే ప్రజలు వెంటనే తెలి యజేయాలి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జిల్లాలో వైసీపీ నేతలు చేసిన అక్రమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి’అని సూచించారు. సమావేశం లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, నాయ కులు పీఎంజే బాబు, పి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.