Share News

సందడే.. సందడి

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:19 AM

Grand Mega PTM విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘మెగా పీటీఎం 4.0’ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఉత్సాహ భరితంగా సాగింది. జిల్లాలోని 2,596 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

 సందడే.. సందడి
నరసన్నపేట : పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలలో తల్లుల పాదాలకు వందనం చేస్తున్న విద్యార్థులు

  • జిల్లాలో ఘనంగా మెగా పీటీఎం

  • ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు

  • పిల్లలు చదువులపై ఆరా

  • ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై హర్షం

  • శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘మెగా పీటీఎం 4.0’ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఉత్సాహ భరితంగా సాగింది. జిల్లాలోని 2,596 ప్రభుత్వ పాఠశాలలు, 40 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది తల్లిదండ్రులు హాజరై తమ పిల్లల విద్యాప్రగతిని తెలుసుకున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మెగా పీటీఎం వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు సందేశాత్మక ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేస్తున్న కృషిని వివరించారు. శుక్రవారం ఉదయం 9 గంటలు నుంచే పాఠశాలల్లో పండుగ వాతావరణం తలపించింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాగత గీతాలతో తల్లిదండ్రులను ఆహ్వానించారు. ప్రతి విద్యార్థి విద్యాప్రగతి, హాజరుశాతం, అభ్యసన సామర్థ్యాలు, చదవడం- రాయడం- గణిత నైపుణ్యాలు, పరీక్షల ఫలితాలు, ప్రవర్తన, క్రమశిక్షణ, భవిష్యత్‌ లక్ష్యాలు వంటి అంశాలను ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థుల బలాలు, మొరుగుపరచాల్సిన అంశాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిజటల్‌ విద్య వినియోగం వంటి విషయాలపై చర్చించారు. పిల్లల ప్రతిభను ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు నిరంతరం పాఠశాలతో అనుసంధానమవ్వాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, విద్యా మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, మొక్కల పెంపకం, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలు తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఇలాంటి సమావేశాలు పిల్లలు భవిష్యత్‌ను మరింత బలోపేతం చేస్తాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

  • 4.15 లక్షల మంది భాగస్వామ్యం : డీఈవో రవిబాబు

  • జిల్లాలో 2,596 ప్రభుత్వ పాఠశాలలో ‘మెగా పీటీఎం 4.0’ ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామని డీఈవో రవిబాబు తెలిపారు. ఆయా పాఠశాలల్లో 1,70,281 మంది తల్లిదండ్రులు, 11,905 మంది ఉపాధ్యాయులు, 1,49,543 మంది విద్యార్ధులు, 33,496 మంది పాఠశాల యాజమాన్య కమిటీసభ్యులు పాల్గొన్నారని పేర్కొన్నారు. వీరితోపాటు 2,348 మంది పూర్వవిద్యార్థులు, 1,619 మంది దాతలు, 3,230 మంది ప్రజాప్రతినిధులు, 1,460 మంది అఽధికారులు, 5,004 మంది ఇతర ఆహ్వానిత సభ్యులు, 36,613 మంది ఇతరులు.. మొత్తం 4,15499 మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు.

Updated Date - Jul 25 , 2026 | 12:19 AM