Share News

ఇంట్లోకి చొరబడిన కింగ్‌ కోబ్రా

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:11 AM

రామచం ద్రాపురం గ్రామానికి చెందిన రైతు పేడూరి శివ ఇంటిలోకి ఓ కింగ్‌ కోబ్రా ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భయాందోళన చెందారు.

 ఇంట్లోకి చొరబడిన కింగ్‌ కోబ్రా

ఆమదాలవలస, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రామచం ద్రాపురం గ్రామానికి చెందిన రైతు పేడూరి శివ ఇంటిలోకి ఓ కింగ్‌ కోబ్రా ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భయాందోళన చెందారు. శివ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి పెద్ద సర్పం (కింగ్‌ కోబ్రా) ప్రవేశించి ఉండవచ్చని, తాము శనివారం ఉదయం చూసి ఆందోళనకు గురయ్యామన్నారు. వెంటనే గ్రామస్థులకు ఈ విషయం తెలుపగా పామును చూసిన గ్రామస్థులు దీనిని కింగ్‌ కోబ్రా (గౌరీబెత్తు)గా తెలిపారన్నారు.

20 అడుగులకు పైగా ఉందని, ఇలాంటి సర్పాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సమీపంలోని వంశధార నదినుంచి కాలువల ద్వారా గ్రామం లోకి చేరి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బందికి తెలిపినా వారి నుంచి స్పందన లేకపోవడంతో భయాందోళన చెందిన గ్రామస్థులు దానిని హతమార్చారు.

Updated Date - Sep 20 , 2026 | 12:11 AM