Share News

విధి నిర్వహణలో గుండెపోటు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:06 AM

అస్సాం రైఫిల్స్‌ లో జవాన్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం రూ రల్‌ మండలం ఒప్పంగి గ్రా మానికి చెందిన పొన్నాన రవికుమార్‌ (48) మృతి చెందారు.

విధి నిర్వహణలో గుండెపోటు
జవాన్‌ పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం, రవికుమార్‌ (ఫైల్‌)

  • అస్సాం రైఫిల్స్‌ జవాన్‌ మృతి

  • ఒప్పంగిలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

శ్రీకాకుళం రూరల్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): అస్సాం రైఫిల్స్‌ లో జవాన్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం రూ రల్‌ మండలం ఒప్పంగి గ్రా మానికి చెందిన పొన్నాన రవికుమార్‌ (48) మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మూడు రోజు ల కిందట విధుల్లో ఉండగానే గుండె పోటుకు గురై మృ తి చెందినట్లు సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యు లు తెలిపారు. మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి తీసుకురాగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రవికుమార్‌ పార్థివదేహంపై ఎమ్మెల్యే గొండు శంకర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యు లకు సానుభూతిని తెలిపారు. దేశ రక్షణలో విధులు నిర్వహి స్తూ జవాన్‌ మృతి చెందడం బాధా కరమన్నారు. జవాన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Jan 03 , 2026 | 12:06 AM