Share News

పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం: సీఈవో

ABN , Publish Date - May 28 , 2026 | 12:32 AM

గ్రామాల పరిశుభ్రతతో ఆరోగ్య వంతమైన సమాజం ఏర్పడుతుందని జడ్పీ సీఈవో వెంకట్రామన్‌ అన్నారు.

పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం: సీఈవో
గారలో పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో వెంకట్రామన్‌

గార, మే 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల పరిశుభ్రతతో ఆరోగ్య వంతమైన సమాజం ఏర్పడుతుందని జడ్పీ సీఈవో వెంకట్రామన్‌ అన్నారు. బుధవారం గారలో ‘స్వచ్ఛపదం’ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు వీధి, గ్రామ పరిశుభ్రతలో భాగస్వాములు కావాలన్నారు. బోరవానిపేటంలో స్వచ్ఛత కేంద్రాన్ని పరిశీలించి సిబ్బం దికి సూచనలిచ్చారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఎరువుగా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడివో ఎన్‌. శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీవో ఎ.రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2026 | 12:32 AM