Share News

స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:20 AM

స్వచ్ఛ మైన గ్రామాలు, పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యపడుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం
స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాసరూరల్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ మైన గ్రామాలు, పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యపడుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండలం రెంటికోట గ్రామంలో గురువారం గ్రామ పారిశుధ్య నిర్వహణ కోసం కే టాయించిన స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛ రథం అనేది కేవ లం చెత్తను ఎత్తడానికే కాదని, గ్రామాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు, పరిశుభ్రకరమైన వాతావరణానికి ప్రధానంగా ఈ వాహనం నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై సహకారం అందజేయాలన్నారు. త డిచెత్త, పొడిచెత్తను క్ర మపద్ధతిలో సేకరించి సేంద్రియ ఎరువు కోసం పునర్వినియోగం చేసేలా వినియోగించడమే ఈ స్వచ్ఛరథం ప్రధాన ల క్ష్యమన్నారు. ప్రజలు చె త్తను ఆరుబయట వేయకుండా వాహనానికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరికట్ల విఠల్‌రావు, టీడీపీ మండల అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణరావు, కార్యదర్శి డి.సంతోష్‌, ఏఎంసీ చైర్మన్‌ వంకల కూర్మారావు, టీడీపీ నాయకులు హొరియా మోహనరావు, కుమారరాజు తదతరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:20 AM