విషసర్పాలకు నిలయంగా
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:11 AM
అక్కుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాత భవనం విషసర్పాలకు నిలయంగా మారింది.
అక్కుపల్లి ఆస్పత్రి పాత భవనం
- తొలగించాలని కోరుతున్న రోగులు
వజ్రపుకొత్తూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): అక్కుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాత భవనం విషసర్పాలకు నిలయంగా మారింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకో వడంతో దీనివెనుకాల ఇటీవల నూతన భవనాన్ని అధికా రులు నిర్మించారు. వాస్తవానికి శిథిల భవనాన్ని తొల గించి దానిస్థానంలో కొత్తది నిర్మించాల్సి ఉన్నా అధికా రులు మాత్రం దానిజోలికి వెళ్లలేదు. శిథిలావస్థలో ఉన్న సిబ్బంది నివాస గృహాలను తొలగించి వాటి స్థానంలో నూతన భవనం నిర్మించారు. పాతభవనాన్ని తొలగించ కపోవడంతో దానిచుట్టూ తుప్పలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయి విషసర్పాలు, కీటకాలు, ఇతర జంతువులకు నిలయంగా మారింది. 24 గంటలు పనిచేసే అక్కుపల్లి ఆసుపత్రికి రాత్రివేళల్లో కూడా రోగులు వస్తుంటారు. అయితే, వారికి దారిలో పాములు, ఇతర విషపురుగులు కనిపిస్తుండడంతో హడలిపోతున్నారు. దీంతో టార్చిలైట్ వెలుగులో ఆసుపత్రికి రావాల్సి వస్తుందనిఅంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత ఆసుపత్రి భవ నాన్ని తొలగించాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు.