పర్యాటక రంగానికి మహర్దశ
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:05 PM
భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుందని, ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మహర్దశ పట్టనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ తెలి పారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుందని, ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మహర్దశ పట్టనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ తెలి పారు. గురువారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్ వద్దగల డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవిసుభాష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసవల్లి సూర్యదేవుని ఆలయ ఆవరణలో భక్తులు, పర్యాటకుల సౌక ర్యార్థం భోజనశాల, వాహనాల పార్కింగ్, రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సూర్యభగవానుని విశేషాలతో ప్రత్యేకకేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామన్నారు. డచ్ బంగ్లాను పునరుద్ధరించి, జిల్లా చరిత్రను ప్రతిబింబించేలా మ్యూజియంగా మారుస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడి చొరవతో ఢిల్లీ స్థాయిలో ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేస్తున్నామని, త్వరలో నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయి, పనులు ప్రారంభి స్తామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష పాల్గొన్నారు.
ఫఅరసవల్లి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి గురువారం దర్శించుకున్నారు.