పాదయాత్రికుడికి ఘన స్వాగతం
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:43 PM
దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు, 4 ధామాలు కాలినడకన వెళ్లి దర్శించు కోవటమే తన లక్ష్య మని ఢిల్లీకి చెందిన సౌరభ్ అన్నారు. 16 నెలల కిందట ఢిల్లీలో పాదయాత్ర ప్రారంభించిన సౌరభ్ శుక్రవారం ఇచ్ఛాపురం చేరుకున్నారు.
34 శక్తిపీఠాలు దర్శనం
ఇప్పటి వరకు 14 వేల కిలోమీటర్ల కాలినడక
ఇచ్ఛాపురం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు, 4 ధామాలు కాలినడకన వెళ్లి దర్శించు కోవటమే తన లక్ష్య మని ఢిల్లీకి చెందిన సౌరభ్ అన్నారు. 16 నెలల కిందట ఢిల్లీలో పాదయాత్ర ప్రారంభించిన సౌరభ్ శుక్రవారం ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర ఆలయంలో ఆయన కు విశ్వహిందూ పరిషత్ ప్రతి నిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సౌరభ్ మాట్లాడు తూ.. గంగోత్రి గోముఖ్ నుంచి జలం తీసుకొని జ్యోతిర్లింగాలు దర్శించుకునేందుకు కాలి నడకన వెళ్తున్నానన్నారు. ఇప్పటివరకు 14 వేల కిలోమీ టర్లు పాదయాత్ర చేపట్టి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో 10, 4 ధామాల్లో 3, 34 శక్తి పీఠాలు దర్శించు కున్నానని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రారం భమైన పాదయాత్ర హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్, ఉత్తరాఖండ్, యూపీ, ఎంపీ, గుజరాత్, మహరాష్ట్ర, కర్ణాటక, తమిళ నాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్ఛాపురం చేరుకు న్నానని తెలిపారు. ఇక్కడి నుంచి పూరీ వైపు వెళ్లనున్నానన్నారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రా ల్లో పర్యటించి నేపాల్ చేరకుంటానన్నారు. కార్య క్రమంలో వీహెచ్‌పీ అధ్యక్షుడు పాక తులసీ దాస్, కార్యదర్శి సదాశివుని శ్రీను, శ్యామ్, రామ లింగ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.