వైభవంగా గ్రామోత్సవం
ABN , Publish Date - May 10 , 2026 | 12:21 AM
ఊడిగలపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అభయాంజనేయ ఉత్సవ విగ్రహాన్ని శనివారం గ్రామప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు.
అభయాంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపు
ఊడిగలపాడులో ఆధ్యాత్మిక సందడి
జలుమూరు, మే 9(ఆంధ్రజ్యోతి): ఊడిగలపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అభయాంజనేయ ఉత్సవ విగ్రహాన్ని శనివారం గ్రామప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా తొలుత గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాధారణ, పంచగవ్యప్రాశన, గోపూజ, ధ్వజారోహణ తదితర పూజా కార్యక్రమాలు వేదపండితులు అక్కాజోష్యుల రమేష్ శర్మ ఆధ్వర్యంలో రాజశేఖర శర్మ, రామచంద్ర శర్మ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో ఆసీనులను చేసి మంగళ వాయిద్యాలతోను, వేదమంత్రాల నడుమ కోలాటం, కళశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో ఊడిగలపాడుతో పాటు కేఎల్‌ఎన్ పేట, ఎర్రన్నపేట, సంతలబైలి గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న వేషధారణలు
పలాస రూరల్, మే 9(ఆంధ్రజ్యోతి): పలాస మండలం టెక్కలిపట్నం గ్రామంలో ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన సంబరాల్లో భాగంగా శనివారం వివిధ వేషధారణ ప్రదర్శన లు ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం పగటి వేషా లతో ఊరేగింపు నిర్వహించగా, సాయంత్రం పౌరాణిక వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు.