ఘనంగా మహా సౌరహోమం
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:55 PM
రథసప్తమి సందర్భంగా విశ్వశాంతి, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని అనివెట్టి మండపంలో శనివారం మహాసౌర హోమం నిర్వహించారు.
అరసవల్లి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రథసప్తమి సందర్భంగా విశ్వశాంతి, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోని అనివెట్టి మండపంలో శనివారం మహాసౌర హోమం నిర్వహించారు. అలాగే అరుణ హోమం, సకల దేవతా మంత్రహవనం, మూలమంత్ర హవనం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి ఫణీంద్ర శర్మ, రంజిత్ శర్మ, నేతేటి హరిబాబు, శరత్‌కుమార్ శర్మ, వేదపండితులు వికాస్ శర్మ, దర్భముళ్ల శ్రీనివాస శర్మ, పార్థసారథి శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు బారువ బీచ్‌లో రథసప్తమి వేడుకలు
సోంపేట, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రథసప్తమిని పురస్కరించుకుని బారువ బీచ్‌లో ఆదివారం గంగాహారతి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్నందున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.