వైభవంగా కామదహనోత్సవం
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:19 AM
అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డోలోత్స వాల్లో భాగంగా ఆదివారం కామదహనోత్సవం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో దేవేరులతో స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అని వెట్టి మండపంలో విశేష పూజలు నిర్వహించారు.
మాడవీధుల్లో ఆదిత్యుని తిరువీధి
అరసవల్లి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డోలోత్స వాల్లో భాగంగా ఆదివారం కామదహనోత్సవం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో దేవేరులతో స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అని వెట్టి మండపంలో విశేష పూజలు నిర్వహించారు. అనం తరం సింహవాహనంపై వేంచేపు చేసి ఆలయ మాడ వీఽఽధుల్లో వేదమంత్రాలు, మేళతాళాల మధ్య తిరు వీధిగా ఆలయానికి చెందిన తోటకు తీసుకు వచ్చారు. అక్కడి మండపం వద్ద వేదపండితులు, అర్చకులు విఘ్నేశ్వర పూజ, లక్ష్మీనారాయణ పూజ చేపట్టారు. అనంతరం కామదహనోత్సవం చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి సాందీప శర్మ, దర్భముళ్ల శ్రీనివాస శర్మ, రంజిత్ శర్మ, నేతేటి హరిబాబు, ఫణీంద్ర శర్మ, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా ఊంజల్ సేవ
కవిటి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): బెజ్జిపుట్టుగ చక్రధర పెరుమాళ్ల డోలోత్సవం, చతుర్థ బ్రహోత్సవంలో భాగంగా ఆదివారం ఊంజల్‌సేవ, పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. సింహాచలానికి చెందిన వేద పండితులు ఎం.నారాయణమూర్తి ఆధ్వర్యంలో రుత్విక్కులు చక్ర స్నానం, ధ్వజారోహణం, మహా పూర్ణాహుతి, మంగళా శాసనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి స్వామికి పుష్పయాగం, ద్వాదశారాధన, నీరాజన మంత్ర పుష్పాలు చేపట్టారు. సోమవారం స్వామివారి డోలోత్సవ యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. యా త్ర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ రవివర్మ తెలిపారు. సోంపేట-కవిటి నుంచి వచ్చే వాహనాలు తీర ప్రాంతం నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు. ఇదిలా ఉండగా చక్రధరపెరుమాళ్ల స్వామి దేవాల యానికి కవిటికి చెందిన వ్యాపారవేత్త పాండవ రామా రావు మైక్‌సెట్‌ను వితరణగా అందించారు. రూ.75 వేలు విలువ కలిగిన సెట్‌ను ఆదివారం ధర్మకర్త పి.కృష్ణా రావుకు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.