Share News

గర్భం దాల్చిన బాలిక

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:49 PM

Pregnancy in a young girl ఓ బాలికపై కామాంధుడు కన్నేశాడు. తల్లిలేని సమయంలో మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో ఓ ఆర్‌ఎంపీ వైద్యుణ్ని సంప్రదించాడు. ఆయన తన వల్లకాదని చెప్పడంతో శ్రీకాకుళంలో జీజీహెచ్‌కు తరలించాడు. దీనిపై బాలిక తల్లి జీజీహెచ్‌ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కామాంధుడు పరారయ్యాడు.

గర్భం దాల్చిన బాలిక

పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు

నిందితుడు పరారీ

పలాస, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఓ బాలికపై కామాంధుడు కన్నేశాడు. తల్లిలేని సమయంలో మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో ఓ ఆర్‌ఎంపీ వైద్యుణ్ని సంప్రదించాడు. ఆయన తన వల్లకాదని చెప్పడంతో శ్రీకాకుళంలో జీజీహెచ్‌కు తరలించాడు. దీనిపై బాలిక తల్లి జీజీహెచ్‌ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ కామాంధుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పలాసలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక(14) తన తల్లితో నివాసం ఉంటోంది. తల్లి ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. అభి అనేవ్యక్తి.. తరచూ వాళ్ల ఇంటికి వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో బాలికపై అతని కళ్లు పడ్డాయి. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. గత నెలలో బాలికకు రుతుస్రావం జరగకపోవడంతో అనుమానం వచ్చి ఓ ఆర్‌ఎంపీ వైద్యుడ్ని సంప్రదించాడు. గర్భనిరోధక మాత్రలు ఇచ్చినా ఆ బాలిక ఆరోగ్యం కుదుటపడలేదు. తన వల్లకాదని ఆ ఆర్‌ఎంపీ చేతులు ఎత్తేసాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చిన విషయం గుర్తించిన తల్లి, ఆమె బంధువులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు శ్రీకాకుళం జీజీహెచ్‌(రిమ్స్‌)కు రిఫర్‌ చేశారు. ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతోంది. ఈ ఘటన బయటపడడంతో అభి పరారీ అయ్యాడు. దీనిపై బాలిక తల్లి జీజీహెచ్‌ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఈ కేసును కాశీబుగ్గ పోలీసులకు రిఫర్‌ చేశారు. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ డీఎస్పీ జీవీ రమణ వద్ద ప్రస్తావించగా.. తమకు ఫిర్యాదు అందిందని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Nov 28 , 2026 | 11:49 PM