Share News

ఎండల మల్లన్న ఆలయం వద్ద తోపులాట

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:28 AM

రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయా నికి ఎదురుగా అయ్యప్ప ఆల యం దగ్గర అన్నదానం క్యూ లో తోపులాట ఘటనలో ము గ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

ఎండల మల్లన్న ఆలయం వద్ద తోపులాట
భక్తురాలికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది

  • ముగ్గురికి గాయాలు

టెక్కలి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయా నికి ఎదురుగా అయ్యప్ప ఆల యం దగ్గర అన్నదానం క్యూ లో తోపులాట ఘటనలో ము గ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అన్నదానం కోసం ముందుగా నిర్వాహకులు బారికేడింగ్‌ ఏర్పాటు చేసినప్పటికీ తోపులాట మూలంగా కింద ఉన్న రేకులు తగిలి సంతబొమ్మాళి మండలం రెయ్యిపేటకు చెందిన ఆర్‌.అనసూయమ్మ, ఆర్‌.సింహాచలం, నందిగాం మండలం మర్లపాడు గ్రామానికి చెందిన డి.శ్రీనివాస్‌ గాయపడ్డారు. వీరు టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శ్రీముఖలింగంలో సొమ్మసిల్లి..

జలుమూరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో స్వామి దర్శనం కోసం క్యూలో ఉన్న టెక్కలి గ్రామానికి చెందిన కె.లలిత కళ్లు తిరిగి సొమ్మసిల్లిపోయింది. దీంతో రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు హరిప్రసాద్‌, కిడ్నీ సెంటరు ప్రతినిధులు వైద్యసేవలు అందించారు. అలాగే ఒరిశాకు చెందిన భక్తురాలు క్యూలో ఉంటూ అస్వస్తతకు గురవ్వడంతో అచ్యుతాపురం పీహెచ్‌సీ సిబ్బంది వైద్యసేవలు అందించారు. ఆలయ ఈవో ఏడుకొండలు, పాలకమండలి చైర్మన్‌ శివప్రసాద్‌ పాడి, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

మహేంద్రగిరుల నుంచి వస్తూ ఆటో బోల్తా

టెక్కలి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది భక్తులు మహాశివరాత్రి పురస్కరించుకొని శని వారం సాయంత్రం తూర్పు కనుమల్లోని మహేంద్రగిరులకు వెళ్లారు. ఈ క్రమం లో ఆదివారం తిరిగి ఆటోలో వస్తుండగా ఒడిశాలోని గారబంద సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన ఎ.హేరమ్మ, ఎన్‌.వాసు, శాంతి, లక్ష్మి, ఎల్‌.ధనలక్ష్మి టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నారు. ధన లక్ష్మి, వాసు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 16 , 2026 | 12:28 AM