Share News

నెరవేరనున్న కల

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:51 PM

పలాస-కాశీబు గ్గ జంటపట్టణాల్లో ఎట్టకేలకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఇక్కడి ప్రజల చిరకాల వాంచ నేరవేరనుంది. దశాబ్దాల కల నెరవేరనుండడం తోపాటు జంట పట్టణాల ప్రజల కష్టాలు గట్టెక్క నున్నాయి.

నెరవేరనున్న కల
ఆర్వోబీ ప్రారంభోత్సవానికి స్థలం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

కాశీబుగ్గ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబు గ్గ జంటపట్టణాల్లో ఎట్టకేలకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఇక్కడి ప్రజల చిరకాల వాంచ నేరవేరనుంది. దశాబ్దాల కల నెరవేరనుండడం తోపాటు జంట పట్టణాల ప్రజల కష్టాలు గట్టెక్క నున్నాయి. ఈనెల ఎనిమిదోతేదీన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చె న్నాయుడులు ఈ బ్రిడ్జిని మాజీ మంత్రి గౌతు శివాజీ సమక్షంలో ప్రారంభించనున్నారు. బ్రిడ్జి ప్రారంభోత్సవ అనంతరం నిర్వహించే బహిరంగ సభ కోసం, కాశీ బుగ్గ మూడు రోడ్ల జంక్షన్‌ వద్ద ఉన్న రైతుబజారు కోసం కేటాయించిన స్థలాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఆమెతోపాటు ఆమెతో పాటు కూటమి నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విటల్‌, లోడగల కామేశ్వరరావు, ఎం.శ్రీనివాస్‌రావు, బడ్డ నాగరాజు, ఎస్‌.నవీన్‌, డిశంకర్‌, నరేంద్ర, సూర్యనారయణ, రాంబాబు, కృష్ణమూర్తి, కె.లక్ష్మణ్‌ ఉన్నారు.

నిర్వాసితులకు

పరిహారం.. ఇళ్ల స్థలాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి రూ.46.64 కోట్లు మంజూరుకావడంతో ఈ ఏడాది జూలై 29న పనులు చేపట్టారు. బ్రిడ్జికి ఇరువైపులా రహదారులు, కాలువలను నిర్మాణం చేపట్టారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన చిన్న చిన్న పనులు త్వరితగతిన పూర్తి చేయనున్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కోసం 127 మంది నిర్వాసితులకు పరిహారం డబ్బులు ఇవ్వడంతో పాటు శివాజీనగర్‌ ప్రాంగణంలో ఇళ్ల స్థలాలు కూడా కేటాయించారు.

రైల్వే గేటు సమస్యకు పరిష్కారం

రైల్వే గేటు మూసివేసిన ప్రతిసారి పలాస-కాశీబుగ్గ జంట్టప ట్టణాల ప్రజలు ట్రాఫిక్‌ సమస్య ఎదుర్కొనేవారు. గంటల తరబడి ఎండ, వానలో గేటు వద్ద వాహనాలతో వేచిఉండాల్సివచ్చేది. అత్యవసర సమయంలో అంబులెన్సులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు రైల్వే గేటు వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనేది. ఈ ఆర్వోబీ అందు బాటులోకి వస్తే రైల్వే గేట్‌ వద్ద నిరీక్షించే సమస్యకు పరిష్కారం దొరక డంతోపాటు పట్టణంలో రాకపోకలు సులభతరం అవుతాయని పలువురు చెబుతున్నారు. పలాస-కాశీబుగ్గతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ట్రాపిక్‌ ఇబ్బందులు గట్టెక్కడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. వ్యాపార,వాణిజ్య కార్య కలాపాలకు కూడా ఊతం లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. ఆర్వోబీ ప్రారంభానికి సిద్ధంకావడంతో మాజీ మంత్రి గౌతు శివాజీ చిరకాల ఆశయం సాకరమయ్యిందని ఎమ్మెల్యే శిరీష తెలిపారు.

మాయమాటలతో కాలం గడిపిన వైసీపీ

ఫ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

వైసీపీ ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి విషయంలో ప్రజలకు మభ్యపెట్టిందని, మాయమాటలతో కాలం గడిపిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరోపించారు. ఆర్వోబీ ప్రారంభోత్సవ అనంతరం నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లకోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్వోబీ పనులు ప్రారంభించి త్వరలో బ్రిడ్జిని అందు బాటులోకి తెస్తామని పలు మార్లు చెప్పినా కార్యరూపం దాల్చలేదన్నారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిధులు సమ కూర్చి పనులను వేగవంతం చేసిందని తెలిపారు. బ్రిడ్జి పనులు పూర్తవుతుండడాన్ని చూసి వైసీపీ నా యకులు క్రెడిట్‌ చోరీ అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కక్కటిగా నెరవేరుస్తోందని తెలిపారు.

Updated Date - Oct 05 , 2026 | 11:51 PM