Share News

‘ఉపాధి’ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:32 PM

గ్రామాల నుంచి వలసలు నివారించి స్థానికం గానే ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్‌ నేతృ త్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథ కాన్ని (ఎంజీఎన్‌ ఆర్‌ఈజీఎస్‌) నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కుట్ర చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు విమర్శించారు.

‘ఉపాధి’ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
కరపత్రాలను ఆవిష్కరిస్తున్న డీసీసీ అధ్యక్షుడు అన్నాజీరావు తదితరులు

అరసవల్లి, జనవరి 10(ఆంరఽధజ్యోతి): గ్రామాల నుంచి వలసలు నివారించి స్థానికం గానే ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్‌ నేతృ త్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథ కాన్ని (ఎంజీఎన్‌ ఆర్‌ఈజీఎస్‌) నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కుట్ర చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు విమర్శించారు. స్థానిక ఇందిరావిజ్ఞాన భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రజలు ఉపాధికి దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామాల్లోని ప్రజలు పనులు లేక వలసలు వెళ్లిపో తున్నారని, దీనిని అరికట్టేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రతిష్టాత్మ కంగా చేపట్టి పకడ్బందీగా అమలు చేసిందన్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో ఇస్తున్న వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించుకోవాలని అనడం దారుణమన్నారు. పనికి భద్రత కల్పించాలని, హామీ తో కూడిన వేతనం ఇవ్వాలని, పథకంలో చేస్తున్న మార్పు లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతు న్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట నిరాహార దీక్ష చేపడుతున్నా మన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూడి కిరణ్‌కుమార్‌, మహేష్‌, నగర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రెల్ల సురేష్‌, గోవింద మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:32 PM