Share News

అంబరాన్నంటిన ‘సిరి’ సంబరం

ABN , Publish Date - May 13 , 2026 | 12:10 AM

వాండ్రంగి గ్రామ దేవత అసిరితల్లి సిరిమాను సంబరం అంబరాన్నంటింది. మంగళవారం పెద్ద అసిరి తల్లి, చిన్న అసిరితల్లి, నేతాలమ్మ అమ్మవార్లను వేలాది మంది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు.

 అంబరాన్నంటిన ‘సిరి’ సంబరం
ప్రధాన వీధిలో సిరిమాను ఊరేగింపు

ఘటాలతో పాల్గొన్న భక్తులు

భక్తజనసంద్రమైన వాండ్రంగి

జి.సిగడాం, మే 12 (ఆంధ్రజ్యోతి): వాండ్రంగి గ్రామ దేవత అసిరితల్లి సిరిమాను సంబరం అంబరాన్నంటింది. మంగళవారం పెద్ద అసిరి తల్లి, చిన్న అసిరితల్లి, నేతాలమ్మ అమ్మవార్లను వేలాది మంది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. ఇందులో భాగంగా సిరిమాను సంబరం భక్తుల ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహిం చారు. అమ్మవారి ఘటాలతో భక్తులు పెద్ద సంఖ్యలో ఊరే గింపులో పాల్గొన్నారు. సిరిమాను సంబరం సందర్భంగా గ్రామం భక్తులతో నిండిపోయింది. వేలాది మంది భక్తులు తరలి రావడంతో గ్రామంలో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది. భక్తులు అమ్మవార్లకు ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ట్రాఫిక్‌ అంతరాయం కలగ కుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తును ఏర్పాటు చేశారు. రాజాం- చిలక పాలెం ప్రధాన రహదారి కావటంతో ప్రయాణికులకు, భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Updated Date - May 13 , 2026 | 12:10 AM