అనుమానాస్పద మరణాలపై సీబీఐతో విచారణ చేయించాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:10 AM
నగరానికి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రెండేళ్లుగా జరుగు తున్న అనుమానాస్పద మరణాలపై సీబీఐతో విచారణ చేయించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి
అరసవల్లి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): నగరానికి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రెండేళ్లుగా జరుగు తున్న అనుమానాస్పద మరణాలపై సీబీఐతో విచారణ చేయించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. నగరం లోని ఇల్లిసిపురం అంబేడ్కర్ భవన్‌లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆదివాసీ విద్యార్థి సవర చంద్ర శేఖర్ వెంటిలేటర్‌పై కొన ప్రాణంతో కొట్టుమిట్టాడు తున్నాడని, దీనికి బాధ్యు లైన వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యంపై అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకో వాలని కోరారు. దవడ శస్త్ర చికిత్సలో వేసిన ప్లేటు తొలగించుకునేందుకు వచ్చిన విద్యార్థి తీవ్ర అస్వస్థ తకు గురై కోమాలోకి వెళ్లడంలో వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. విద్యా ర్థికి తక్షణమే మరింత మెరుగైన వైద్యం అందించాలని, విద్యార్థి కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం రూ. కోటి పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కృష్ణారావు, జానకి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథం, వివిధ సంఘాల నేతలు పేడాడ కృష్ణారావు, సవర ఏబేరు, కోత ధర్మారావు, పత్రి దానేష్, దుర్గాశి గణేష్ తదితరులు పాల్గొన్నారు.