బంగారం, సొమ్ము మాయంపై కేసు
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:10 AM
నగరంలోని ఫాజుల్‌బేగ్ పేటలో బంగారం, సొమ్ము మాయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు.
శ్రీకాకుళం క్రైం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): నగరంలోని ఫాజుల్‌బేగ్ పేటలో బంగారం, సొమ్ము మాయంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన పెద్దింటి గౌరీదేవి ఈనెల 7న తన ఇంటికి విద్యుత్ మరమ్మతు పనులు చేయించారు. సాయంత్రం పనులు చేసిన వారు వెళ్లిన తరువాత చూసుకోగా ఇంట్లో మేడమీద ఉన్న బెడ్‌రూం బీరువాలోని సుమారు తులం బంగారు గొలుసు, తులం చెవి రింగులు, రూ.40 వేలు నగదు మాయమైనట్లు గుర్తించారు. ఇంటికి విద్యుత్తు రిపేరు పనికి వచ్చిన వారిపై అనుమానంతో శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.