తల్లి, బిడ్డ అదృశ్యంపై కేసు నమోదు
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:06 AM
కొర్లాం పం చాయతీ బ్రాహ్మణ కొర్లాం గ్రామానికి చెందిన జోరామణి మహాపాత్రో (32) తన మూ డేళ్ల కుమార్తె ఖుషి మహంతి తో అదృశ్యమైనట్టు తండ్రి నర సింగ మహాపాత్రో శనివారం బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోంపేట రూరల్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కొర్లాం పం చాయతీ బ్రాహ్మణ కొర్లాం గ్రామానికి చెందిన జోరామణి మహాపాత్రో (32) తన మూ డేళ్ల కుమార్తె ఖుషి మహంతి తో అదృశ్యమైనట్టు తండ్రి నర సింగ మహాపాత్రో శనివారం బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ హరిబాబునా యుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణు పూర్ బ్లాక్‌కు చెందిన సంతోష్‌కుమార్ మహంతితో జోరామణి మహాపాత్రోకు 2021లో వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. మతిస్థిమితం కోల్పోయిన జోరామణి తరచూ బయటకు వెళ్లిపోయి తిరిగి వస్తుండేంది. ఈ క్రమంలో గత నెల 25న కుమార్తెతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శనివారం నరసింగ మహాపాత్రో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.