Share News

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌: శంకర్‌

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:00 AM

క్రీడలతో యువతకు మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌: శంకర్‌
సబ్‌ జూనియర్‌ విభాగంలో విజేత విశాఖపట్నం జట్టుకు ట్రోఫీ అందిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): క్రీడలతో యువతకు మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక ఏడురోడ్ల జంక్షన్‌లోని మునిసిపల్‌ కల్యాణమండపంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఇంటర్‌ డిస్ర్టిక్ట్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌ ముగింపు కార్య క్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జిల్లా కేంద్రంలో స్టేడియం, ఇండోర్‌ స్టేడి యం అందుబాటులోకి వస్తున్నాదన్నారు. అన్ని రకాల క్రీడా కోర్టులను తయారుచేయిస్తున్నా మన్నారు. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు వందలాదిమంది క్రీడాకారులు పాల్గొనడం ఆనందంగా ఉంద న్నారు. అనంతరం విజేతలను, కోచ్‌లను అభినందించారు. ఇటీవల వియత్నాంలో జరిగిన అంతర్జాతీయస్థాయి పోటీల్లో 40 పైబడిన విభాగంలో స్వర్ణం సాధించిన శిరీషతోపాటు పత కాలు సాధించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్ర మంలో నిర్వాహకులు, పలువురు క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:00 AM