Share News

ప్రభుత్వ బడుల్లోనే ఉజ్వల భవిష్యత్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:15 AM

విద్యార్థుల మనస్తత్వం ఆధారంగా విద్యనందించే ఉపా ధ్యాయులు ప్రభుత్వ పాఠశాల ల్లోనే ఉన్నారని, అక్కడే వారికి ఉజ్వల భవిష్యత్‌ లభిస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ రాష్ట్ర చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

 ప్రభుత్వ బడుల్లోనే ఉజ్వల భవిష్యత్‌
అంగీకారపత్రం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

పొందూరు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల మనస్తత్వం ఆధారంగా విద్యనందించే ఉపా ధ్యాయులు ప్రభుత్వ పాఠశాల ల్లోనే ఉన్నారని, అక్కడే వారికి ఉజ్వల భవిష్యత్‌ లభిస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ రాష్ట్ర చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. ఎంఈవోలు ఎం.వాగ్దేవి, పి.రాజా రావు ఆధ్వర్యంలో పొందూరు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. విద్యార్థు లకు సరళమైన విద్యావిధానంలో బోధన అందించే సామర్థ్యం ప్రభుత్వ ఉపాధ్యా యు లకే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని ఇళ్లకు ఆయన వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తామని వారి తల్లిదండ్రుల నుంచి అనుమతిపత్రాలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎం పీడీవో వాసుదేవరావు, డిప్యూటీ ఎంపీడీ వోలు అప్పన్న, సింహాచలం, ఈవో జగదీష్‌ టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మో హన్‌, తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర భాస్కర్‌, ఎంపీటీసీ బాడాన గిరి, మండల మహిళా అధ్యక్షురాలు ఎ.విజయలక్ష్మి, తెలుగు యువత మండల అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

‘ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి’

సర్వశిక్షా అభియాన్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగు లుగా 14 ఏళ్లుగా పని చేస్తు న్నా ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, తగు చర్యలు తీసుకుని ఆదుకోవాలని ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్ట్‌ ఉద్యో గులు కోరారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే, పీ యూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఐదేళ్లుగా ఒక్క రూపాయి వేతనం పెరగలేదని, వస్తున్న చాలీ చాలని జీతాలతోనే కుటుంబాలను పోషించు కునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆయ న దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, సీఆర్‌ఎంటీలు, పీటీఐలు ఉన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:15 AM