Share News

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు: డీసీసీబీ చైర్మన్‌

ABN , Publish Date - May 08 , 2026 | 12:41 AM

విద్యార్థి దశ నుంచి క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ అన్నారు.

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు: డీసీసీబీ చైర్మన్‌
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సూర్యనారాయణ

ఆమదాలవలస, మే 7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచి క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న సీఎంసీసీ క్రికెట్‌ టోర్నమెట్‌ రెండోరోజు పోటీల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర టీడీపీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎఫ్‌సీసీ శ్రీకాకుళం, నరసన్నపేట జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ పోటీలను చైర్మన్‌ సూర్యనారాయణ టాస్‌ వేసి ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో ఎస్‌సిసి శ్రీకాకుళంపై నరసన్నపేట జట్టు విజయం సాధించింది. అనంతరం జరిగిన సమావేశంలో చైర్మన్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు క్రీడలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 12:41 AM