Share News

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:46 PM

క్రీడల్లో యువత రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ తెలిపారు.

 క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌
కంచిలి: మఖరాంపురం క్రికెట్‌ మైదానంలో విజేతలతో విశాఖ జిల్లా న్యాయాధికారి :

సరుబుజ్జిలి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): క్రీడల్లో యువత రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ తెలిపారు. బుధవారం యరగాంలో సంక్రాంతి పురస్కరించుకుని గురువు వెంకట కృష్ణవేణమ్మ ఉత్తరాంధ్రస్థాయి వాలీబాల్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగఎంపికల్లో క్రీడల్లో రాణించిన నిరుద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఉత్తరాంధ్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్న టీడీపీ మండలప్రధాన కార్యదర్శి గురువు తిరుమ లరావును అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్నాల అప్పారావు, వెంకటరావు, మల్లేశ్వరరావు, గోవిందరావు పాల్గొన్నారు.

రణస్థలంలో క్రికెట్‌ టోర్నమెంట్‌

రణస్థలం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రణస్థలం జడ్పీ హైస్కూల్‌ క్రీడా ప్రాంగణంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధ వారం ప్రారంభించారు ఆరు జట్లు పాల్గొనగా జేఆర్‌పురం జూనియర్‌ క్రికెట్‌ జట్టు విజేతగా, రన్నర్‌గా గురుగిబిల్లి జట్టునిలిచాయి. మూడో స్థానంలో జేఆర్‌పురం జట్టు నిలిచింది. కార్యక్రమంలో ఇడదాసుల సత్యంనారాయణ, తిరుపతిరాజు, పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సీనియర్‌ క్రికెట్‌ విజేత మఖరాంపురం

కంచిలి, జనవరి 14(ఆంఽధ్రజ్యోతి): స్థానిక క్రికెట్‌ మైదానంలో బుధవారం జరిగిన సీనియర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో మఖరాంపురం జట్టు విజయం సాధించినట్లు నిర్వహకులు తెలిపారు. ఇచ్ఛాపురం, బొరివంక, మఖరాంపురం జట్లు తలపడగా మఖరాంపురం జట్టు విజయం సాధిం చగా, బొరివంక జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు రాజమండ్రి డీఆర్వో తమరాల సీతారామ్మూర్తి, విశాఖపట్నం జిల్లా న్యాయాధికారి గొనప షణ్ముఖరావు, కోల్‌ఇండియా రిటైర్డ్‌ ఉద్యోగి మాదిన వెంకటరమణ, విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాక ఏడీ మాదిన ప్రసాద్‌, సర్పంచ్‌ తమరాల శోభన్‌బాబు, వజ్జ మృత్యుంజయరావు, ఇప్పిలి కృష్ణారావు బహు మతులు అందజేశారు.

ఎం.తోటూరులో గాలిపటాల పోటీలు

ఇచ్ఛాపురం, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఎం.తోటూరులో యువసూర్య చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం గాలిప టాలు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది రంగారావు, ఎంపీటీసీ కాళ్ల గోపి పాల్గొన్నారు.

శివానంద గిరి కొండపై..

ఇచ్ఛాపురం, జనవరి 14(ఆంధ్రజ్యోతి):బెల్లుపడ శివానందగిరి కొండపై కొలువుదీరిన త్రినాఽథస్వామి ఆలయం వద్ద భోగి పురస్కరించుకుని బుధ వారం మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి, గ్రామపెద్దలు ఆశి జీవులురెడ్డి, దుర్గాశి పాపారావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిల ర్‌ ఆశి లీలారాణి పాల్గొన్నారు.

ఫఎచ్చెర్ల, జనవరి 14(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలో విశ్రాంత వీఆర్వో, టీడీపీ నేత జరుగుళ్ల వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు జరిగాయి. అలాగే గ్రామంలోని యువతకు క్రికెట్‌ పోటీలు నిర్వహించారు.

Updated Date - Jan 14 , 2026 | 11:46 PM