బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:47 PM
సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చెప్పారు.
శ్రీకాకుళం, జనవరి 14(ఆంధ్రజ్యోతి) : సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చెప్పారు.ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ఆపదలో ఉన్న పేదలకు కొండంత అండగా నిలుస్తోందని తెలిపారు. బుధవా రం శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన మొత్తం రూ.3.27లక్షలు విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా తక్షణ ఆర్థిక సహాయం అందడం ఊరటనిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.