కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:58 PM
కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.
నరసన్నపేట, మార్చి 10(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం పోలాకి మండలంలోని మబుగాంలో ఇటీవల ప్రమాదంలో మృతిచెందిన మాకివలస గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రావాడ ఉదయ్ కుటుంబ సభ్యులకు రూ.ఐదు లక్షలు సభ్యత్వ ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆపద సమయంలో కార్యకర్తలకు ఆపన్నహస్తంగా నిలుస్తుందని తెలిపారు.కార్యక్రమంలో వంశధార డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, యాళ్ల వేణుగోపాలరావు పాల్గొన్నారు.