వైద్యరంగానికి పెద్దపీట
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:47 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరో గ్యానికి పెద్దపీట వేస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
శ్రీకాకుళం కల్చరల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరో గ్యానికి పెద్దపీట వేస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో జాయింట్ స్క్వాహెల్త్(జోష్)టీమును గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్య క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈటీములు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగానే గురువారం శ్రీకాకుళం లోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో జోష్‌టీమునుగొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ యువత భాగస్వామ్యంతో క్షయ రహిత శ్రీకాకుళం సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు టీవీ వ్యాధిగ్ర స్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. జిల్లాలో టీబీ ముక్త పంచాయతీలుగా ఎంపికైన కార్యదర్శులకు షీల్డు, సర్టిఫికెట్లను ప్రదానంచేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో నరేష్‌కుమార్, అడిషినల్ డీఎంహెచ్‌వో టి.శ్రీకాంత్, డీఐవో రాందాస్ పాల్గొన్నారు.
ఫశ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్‌ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే శంకర్ సమావేశమయ్యారు.
ఫశ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో టిడ్కో అపార్ట్‌మెంట్లకు సంబంధించి రెండో విడతలో భాగంగా 423 మంది లబ్ధిదారులకు రూ.1,77,81,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గొండు శంకర్ అందజేశా రు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శ్రావణ్‌కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, నేతలు పీఎంజేబాబు, ప్రధాన విజయరాం, రెడ్డి గిరిజాశంకర్, అంధ వరపు సంతోష్, ఎంహెచ్‌ఎం సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.