Share News

అరసవల్లిలో ‘సామాన్య’ దర్శనానికే పెద్దపీట

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:26 PM

అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులకు అగ్రతాంబూలం ఇస్తున్నామని.. గర్భగుడి ఎదుట నాలుగు వరుసల క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పించనున్నామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

అరసవల్లిలో ‘సామాన్య’ దర్శనానికే పెద్దపీట

శ్రీకాకుళం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులకు అగ్రతాంబూలం ఇస్తున్నా మని.. గర్భగుడి ఎదుట నాలుగు వరుసల క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పించనున్నామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. మంగళ వారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రథసప్తమి వేడుకల నిర్వహణలో ఎటువంటి లోటు పాట్లు ఉండకూడదని, ప్రతి సెక్టార్‌లో కీలక శాఖల అధికారులు అందుబాటులో ఉండి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వీఐపీల రాక వల్ల సామాన్య భక్తుల క్యూలైన్లకు ఎక్కడా అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దాతల పాసులు ఉన్న వారికి నేరుగా ప్రవేశం ఉంటుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఒక ప్రత్యేక వర్గానికి (మత్స్యకారులు, గిరిజ నులు, ఇతర రాష్ట్రాల వారు) ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కేఆర్‌ స్టేడియంలో చిన్నారుల కోసం ‘కిడ్స్‌ జోన్‌’, అమ్యూ జ్‌మెంట్‌ పార్కును సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఆహారం పంపిణీ చేసే దాతల కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. క్యూలైన్లలో భక్తులు ఎండకు గురి కాకుండా షేడ్‌ నెట్‌లు అమర్చాలని, చల్లటి మజ్జిగ పంపిణీ చేయాలని సూచిం చారు. జిల్లా ప్రతిష్టను చాటి చెప్పేలా రథసప్తమి వేడుకలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డీఆర్వో లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయిప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, అరసవల్లి ఆలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:26 PM