బురదలో కూరుకుపోయిన యాచకుడు
ABN , Publish Date - May 07 , 2026 | 12:31 AM
స్థానిక వంశ ధార రిజర్వాయర్‌కు సంబంధించి జరుగుతున్న పను ల్లో భాగంగా తవ్విన చిన్నపాటి కాలువలో ఒక యాచ కుడు మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు పడిపో యాడు.
రాత్రంతా అందులోనే..
కాపాడిన స్థానిక యువత, పోలీసులు
హిరమండలం, మే 6(ఆంధ్రజ్యోతి): స్థానిక వంశ ధార రిజర్వాయర్‌కు సంబంధించి జరుగుతున్న పను ల్లో భాగంగా తవ్విన చిన్నపాటి కాలువలో ఒక యాచ కుడు మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు పడిపో యాడు.. కాలువ బురదలోనే కూరుకుపోవడంతో బయటకు రాలేక రాంత్రంతా అలానే ఉండిపోయాడు. బుధవారం కొంతమంది యువకులు చూసి ఆ వ్యక్తి చనిపోయాడేమో అనుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ అక్కడి చేరుకొని కొంతమంది యువకుల సాయంతో బురదలో కూరుకుపోయిన యాచకుడ్ని బయటకు తీసి చూడగా.. ప్రాణానికి ప్రమాదంలేకపోవడంతో సపర్యలు చేశారు. స్నానం చేయించి, మాసిన జుత్తు, గడ్డ గీయించారు. కొత్త బట్టలు వేయించి అతడికి కొత్తరూపాన్ని తీసుకువ చ్చారు. ఆహారం పెట్టి అనంతరం హిరమండలంలో విడిచిపెట్టారు. మతిస్థితిమితం లేకపోవడంతో ఈ వ్యక్తి యాచన చూస్తూ జీవిస్తుంటాడు. కాగా ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పిస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు.