Share News

29 శాతం ఐఆర్‌ ప్రకటించాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:51 PM

ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 29శాతం ఐఆర్‌ ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

 29 శాతం ఐఆర్‌ ప్రకటించాలి
మాట్లాడుతున్న యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు

యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌/అరసవల్లి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 29శాతం ఐఆర్‌ ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఆదివారం సంఘ కార్యాలయంలో జిల్లా కార్యదర్శిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిషన్‌ ఆరునెలలల్లోగా రిపోర్టు అందించాలని, వివిధ యాప్స్‌తో బోధన సమయం వృధా అవుతుంది కాబట్టి ఆన్‌లైన్‌ వర్క్‌ తొలగించాలన్నారు. ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌ తక్షణమే అందుబాటులో ఉంచాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ బీఎ బిల్లులు పెట్టేందుకు ఆన్‌లైన్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకు ముం దు ఉపాధ్యాయ ఉద్యమనేత, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొత్తకోట రామలక్ష్మి 8వ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు లండ బాబూరావు, సంఘ నాయకులు శ్రీరామ్మూర్తి కె.శ్రీనివాస్‌, కె.విజయగౌరి, పేడాడ ప్రభాకరరావు, కొత్తకోట అప్పారావు, పి.ధనలక్ష్మి, ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:51 PM