Share News

ద్వితీయ ఇంటర్‌లో 98.34 శాతం హాజరు

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:17 AM

Inter second year exams ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 71 కేంద్రాల్లో తెలుగు/ సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. 19,158 మంది విద్యార్థులకుగానూ 18,840 మంది(98.34 శాతం) పరీక్షకు హాజరయ్యారు.

ద్వితీయ ఇంటర్‌లో 98.34 శాతం హాజరు
నరసన్నపేటలో పరీక్షా కేంద్రం వద్ద ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు

318 మంది విద్యార్థులు గైర్హాజరు

నరసన్నపేట/ గుజరాతీపేట, ఫిబ్రవరి 24(ఆంఽధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 71 కేంద్రాల్లో తెలుగు/ సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. 19,158 మంది విద్యార్థులకుగానూ 18,840 మంది(98.34 శాతం) పరీక్షకు హాజరయ్యారు. 318 మంది గైర్హాజరయ్యారని ఆర్‌ఐవో ఆర్‌.సురేష్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘జనరల్‌ విద్యార్థులు 18,057 మందికి 17,766 మంది హాజరయ్యారు. 291 మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్‌కు చెందిన 1101 మంది విద్యార్థులకు గాను 1074 మంది పరీక్ష రాశారు. 27 మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీసు జరగలేద’ని ఆర్‌ఐవో తెలిపారు. జిల్లాలో పలు కేంద్రాలను ఇంటర్‌ బోర్డు అధికారులు పరిశీలించారు. నరసన్నపేటలోని నాలుగు కేంద్రాల్లో పోలీసులు ప్రతీ విద్యార్థికీ క్షుణ్నంగా తనిఖీలు చేసి.. లోపలకు అనుమతించారు. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చందు అనే దివ్యాంగ విద్యార్థి తల్లిసహాయంతో పరీక్ష రాసేందుకు వచ్చారు. స్రైబ్‌ సహాయంతో పరీక్షలు రాసే అభ్యర్థులకు అదనంగా అరగంట సమయం కేటాయించారు.

Updated Date - Feb 25 , 2026 | 12:17 AM