Share News

కూటమికి 98 శాతం సీట్లు ఖాయం

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:23 AM

రానున్న స్థానిక సంస్థలు, మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి 98 శాతం సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని స్థానిక సంస్థల ఎన్నికల టీడీపీ జిల్లా పరిశీలకుడు మహ్మద్‌నజీర్‌ దీమా వ్యక్తం చేశారు.

 కూటమికి 98 శాతం సీట్లు ఖాయం
మాట్లాడుతున్న మహ్మద్‌ నజీర్‌:

శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యో తి): రానున్న స్థానిక సంస్థలు, మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి 98 శాతం సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని స్థానిక సంస్థల ఎన్నికల టీడీపీ జిల్లా పరిశీలకుడు మహ్మద్‌నజీర్‌ దీమా వ్యక్తం చేశారు. గురువా రం శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో జిల్లాలోని ఎనిమిది నియోజక వర్గాల సమన్వయకర్తలతో ఎన్నికల సన్నద్దతపై సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా నజీర్‌ మాట్లాడుతూ కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అనేక అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమాలే రానున్న ఎన్నికల్లో కూటమి విజయానికి దోహదపడతాయని చెప్పారు. పలాస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లోనూ కూటమి ఆధితప్యం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. స్థానిక ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి,పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిశీలకులు చౌదరి అవినాష్‌, అప్పలనాయుడు, బిడ్డిక పద్మావతి, డొంకాడరామకృష్ణ, బొంగు సురేష్‌, కర్రోతు నరసింగరావు, నుంచి వజ్జ బాబూరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:23 AM