Share News

టీడీపీలో 70 కుటుంబాల చేరిక

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:55 PM

మండలంలోని ఆర్‌.బైరిపురానికి చెందిన మాజీ సర్పంచ్‌ రమాదేవి, ప్రభాకరరావుతోపాటు 70 కుటుంబాలకు చెందిన వారంతా టీడీపీలో చేరారు.

 టీడీపీలో 70 కుటుంబాల చేరిక
కవిటి: టీడీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే అశోక్‌:

కవిటి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్‌.బైరిపురానికి చెందిన మాజీ సర్పంచ్‌ రమాదేవి, ప్రభాకరరావుతోపాటు 70 కుటుంబాలకు చెందిన వారంతా టీడీపీలో చేరారు. శనివారం రామయ్యపుట్టుగలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే,విప్‌ బెందాళం అశోక్‌ సమ క్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు. వీరికి పార్టీ కండువాలు వేసి ఎమ్మెల్యేఅశోక్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌వీరమణ, టీడీపీ మండలాధ్యక్షుడు పి.కృష్ణారావు, మణిచంద్రప్రకాష్‌, బాసుదేవ్‌ ప్రదాన్‌, నేతలు బి.రమేష్‌, పి.రాజు, బి.తిరుమలరావు పాల్గొన్నారు.

టీడీపీలోకి ముగ్గురు మాజీ కౌన్సిలర్లు..

ఇచ్ఛాపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో వైసీపీకీ చెందిన ముగ్గురు మాజీ కౌన్సిలర్లతోపాటు మరో ముగ్గురునాయకులు టీడీపీలో చేరారు. 8, 11, 17వార్డుల మాజీ కౌన్సిలర్లు పల్లంటి వెంకటప్రసాద్‌, రెయ్యి నారాయణ, బోనేల ఆనంద్‌తో పాటు పల్లంటి కిరణ్‌కుమార్‌, మొహ్మద్‌ రఫీఉద్దీన్‌, పైల నారాయణలు శనివారం రాత్రి రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యే అశోక్‌ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Updated Date - Oct 17 , 2026 | 11:55 PM