Share News

టీడీపీలో 70 కుటుంబాల చేరిక

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:50 PM

కంచిలి మండలంలోని కుంబరి నౌగాం గ్రామానికి చెందిన 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రామయ్యపుట్టుగలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ సమక్షంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

టీడీపీలో 70 కుటుంబాల చేరిక
పార్టీలో చేరిన వారికి ఆహ్వానిస్తున్న ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌:

కవిటి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కంచిలి మండలంలోని కుంబరి నౌగాం గ్రామానికి చెందిన 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రామయ్యపుట్టుగలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ సమక్షంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ మేరకు సీపీఎంకు చెందిన వారంతా టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో కంచిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఎం.రామారావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌వీ రమణ, మాజీ సర్పంచ్‌ పండా, కిషోర్‌ పాడి, ఎం.ఆనంద్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:50 PM