టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:25 AM
నియోజకవర్గం పరిధిలోని చీడివలస, గంగంపేట గ్రామాలకు చెందిన 50 కుటుంబా లు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస/బూర్జ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం పరిధిలోని చీడివలస, గంగంపేట గ్రామాలకు చెందిన 50 కుటుంబా లు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీకి చెందిన మత్స్యకార సొసైటీ డైరెక్టర్ కోరగంజి సింహాచలం, పులసరి రాంబాబు, బొడ్డేపల్లి రాముతో పాటు 50 కుటుంబాల వారు టీడీపీలో చేరగా వారికి ఎమ్మెల్యే కూన రవి కుమార్ పార్టీ కండువాలు వేసి ఆహ్వా నించారు. కూటమి ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యే రవి కుమార్ నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములై పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. బూర్జ మండల టీడీపీ నేతలు పిల్ల కన్నంనాయుడు, మేడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలోని పొందూరు, బూర్జ, ఆమదాలవలస జడ్పీటీసీ స్థానాలను టీడీపీకి కేటాయించగా అభ్యర్థులకు ఎమ్మెల్యే రవికుమార్ బీఫారాలను అంద జేశారు. సరుబుజ్జిలి జన సేనకు కేటాయించారు.