టీడీపీలో 50 వైసీపీ కుటుంబాలు చేరిక
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:31 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేప థ్యంలో నామినేషన్ల ప్రక్రియకు ముందుగానే మండలంలో వైసీపీకి షాక్ తగిలింది.
సరుబుజ్జిలి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేప థ్యంలో నామినేషన్ల ప్రక్రియకు ముందుగానే మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. చిన్న వెంకటాపురం, పెద్ద పాలెం, కొత్తకోట, మతలబుపేట గ్రామాల్లో వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు శుక్రవారం టీడీపీ లో చేరాయి. వీరికి ఎమ్మెల్యే కూన రవికుమార్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో చిన్న వెంకటాపురానికి చెందిన గరుగుబిల్లి గణేశ్వరరావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు, మత లబుపేటకి చెందిన సనపల కృష్ణ ఆధ్వర్యంలో ఆరు కుటుంబాలు, కొత్తకోట, పెద్ద పాలెం గ్రామాలకు చెందిన మరికొన్ని కుటుంబాల వారు ఉన్నారు. కార్య క్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిన గవరయ్య
ఇచ్ఛాపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రము ఖ వ్యాపారవేత్త, హోటల్స్ యూనియన్ ప్రతినిధి ముప్పన గవరయ్య టీడీ పీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం గవరయ్యకు రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. రానున్న మునిసి పల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాల న్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పత్రి తవిటయ్య, మాజీ కౌన్సిలర్ కాళ్ల దిలీప్, కాళ్ల జయదేవ్, గౌరీజీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.