40 టన్నుల యూరియా సిద్ధం
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:27 PM
ఎమ్మా ర్పీకి మించి వ్యాపారులు ఎరువులు వి క్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. ప్రైవేట్ వర్తకులు వద్ద 40టన్నుల యూరియా సిద్ధంగా ఉందని తెలిపారు.
టెక్కలి, జన వరి 8(ఆంధ్ర జ్యోతి): ఎమ్మా ర్పీకి మించి వ్యాపారులు ఎరువులు వి క్రయిస్తే చర్యలు తప్పవని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. ప్రైవేట్ వర్తకులు వద్ద 40టన్నుల యూరియా సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం టెక్కలిలోని ఎరువుల దుకాణాల ను వ్యవసాయశాఖ అధికారులు తనిఖీ చేశారు. దుకాణాల్లో నమూనాలు సేకరించి విశాఖలోని ప్రాంతీయ కోడింగ్ కేంద్రానికి పంపించామని, విశ్లే షణ ఫలితాలు, నిర్దేశిత ప్రమా ణాలకు అనుగుణంగా లేకపోతే ఎరువులు నియంత్రణ -1985 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరావు, విస్తరణ అధికారి అశోక్ పాల్గొన్నారు.