Share News

3.370 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - May 30 , 2026 | 11:50 PM

కంచిలి రైల్వేక్వార్టర్స్‌ సమీపంలో 3.370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఒకరిని శనివారం అరెస్ట్‌ చేసినట్లు సోంపేట సీఐ బి.మంగరాజు తెలిపారు. శనివారం కంచిలి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు.

3.370 కిలోల గంజాయి స్వాధీనం

కంచిలి, మే 30 (ఆంధ్రజ్యోతి): కంచిలి రైల్వేక్వార్టర్స్‌ సమీపంలో 3.370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఒకరిని శనివారం అరెస్ట్‌ చేసినట్లు సోంపేట సీఐ బి.మంగరాజు తెలిపారు. శనివారం కంచిలి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఐ కథనం మేరకు.. ఒడిశాలోని గమిధర గ్రామానికి చెందిన అభినవసింగ్‌ మాల్కాజ్‌గిరికి చెందిన సుమన్‌ వద్ద గంజాయి కొనుగోలు చేసి బెంగళూరు తరలించేందుకు సిద్ధమయ్యాడు. ఉదయం రైల్వేస్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కి బెంగళూరు వెళ్లేందుకు రైల్వేక్వార్టర్స్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. ఇంతలో ఎస్‌ఐ పి.పారినాయుడు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.ఈక్రమంలో ఆయన వద్ద 3.370 కిలోల గంజాయి ప్యాకెట్‌ లభించింది. గంజాయితోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సోంపేట కోర్టులో హాజరు పరిచారు. గంజాయి పట్టుకున్న ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి అభినందించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - May 30 , 2026 | 11:50 PM