Share News

టీడీపీలోకి 300 కుటుంబాలు

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:16 AM

YSRCP activists join TDP పలాస నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు భారీ షాక్‌ తగిలింది. మాజీమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు స్వగ్రామం దేవునల్తాడ గ్రామానికి చెందిన వంద మంది వైసీపీ కార్యకర్తలు కుటుంబాలతోసహా.. ఆదివారం ఎమ్మెల్యే గౌతు శిరీష సమక్షంలో టీడీపీలో చేరారు.

టీడీపీలోకి 300 కుటుంబాలు
ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు, మహిళలు

మాజీమంత్రి స్వగ్రామం నుంచి 100 మంది వైసీపీ కార్యకర్తలు చేరిక

కొత్తపేట నుంచి మరో 200 మంది..

పలాస, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు భారీ షాక్‌ తగిలింది. మాజీమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు స్వగ్రామం దేవునల్తాడ గ్రామానికి చెందిన వంద మంది వైసీపీ కార్యకర్తలు కుటుంబాలతోసహా.. ఆదివారం ఎమ్మెల్యే గౌతు శిరీష సమక్షంలో టీడీపీలో చేరారు. వీరితోపాటు కొత్తపేట పంచాయతీకి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పలాసలోని టీడీపీ కార్యాలయంలో వారందరికీ ఎమ్మెల్యే శిరీష పసపుకండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మరింత బలోపేతమైందని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే శిరీష కోరారు. టీడీపీ చేరిన వారంతా మాట్లాడుతూ.. వైసీపీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా కులానికి చెందినవాడిగా మాజీమంత్రికి అండగా నిలిచాం. పదవిలో ఉన్నప్పుడు మా గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు. కూటమి పాలనలో ఎమ్మెల్యే గౌతు శిరీష సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మహిళగా ఆమె పడుతున్న కష్టాన్ని గుర్తించి.. తాము అండగా ఉండాలని టీడీపీలో చేరామ’ని గుంటు వాసు, గుంటు బాలకృష్ణ, సీత బాలరాజు తదితరులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావు, గోవిందు పాపారావు, పుచ్చ ఈశ్వరరావు, తులే అప్పోజి పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 12:16 AM