టీడీపీలో చేరిన 30 వైసీపీ కుటుంబాలు
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:53 PM
ఈదులవలసలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. సోమవారం మబగాంలో ఎమ్మెల్యే బగ్గ రమణమూర్తి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
పోలాకి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఈదులవలసలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. సోమవారం మబగాంలో ఎమ్మెల్యే బగ్గ రమణమూర్తి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వైసీపీ సిద్ధాంతాలు నచ్చకే టీడీపీలో చేరినట్టు వారు స్పష్టం చేశారు. రానున్న స్ధానిక ఎన్నికలకు టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బొమ్మాళి బలరాం, దండుపాటి కుమార్ తదితరుల పాల్గొన్నారు.
రామ్మోహన్ ఎదుగుదల చూడలేకే విమర్శలు
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, మార్చి 9(ఆంధ్రజ్యోతి): జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎదిగిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం ద్వారా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ పాలనలో జిల్లాకు ఏమి చేశారో ఆ పార్టీ నాయకులు చెప్పలరా అని ప్రశ్నించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రామ్మోహన్‌నాయుడి వ్యక్తిత్వం అందరికీ తెలుసునన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు, ఉత్తరాంధ్రకు మణిహారమైన రైల్వేజోన్ సాధనలో రామ్మోహన్‌నాయుడు చేసిన కృషి గుర్తించాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టించిన ఘనత కూడా రామ్మోహాన్‌నాయుడుకే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు జిల్లాలో ఏమి చేశారో చెప్పాలన్నారు. రామ్మోహన్ సారథ్యంలోనే జిల్లాలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు. వంశధార ప్రాజెక్టు పనులకు ఊపిరి పోయడం, నేరడి బ్యారేజీ కదిలికలో రామ్మోహన్ చేసిన కృషి ఎనలేనిదన్నారు.