ఫిన్‌లాండ్ పర్యటనకు 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:04 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపా ధ్యాయ అవార్డులు పొం దిన వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేం దుకు విద్యా శాఖ నిర్ణ యించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు పొందిన 29 మందికి ఎంపిక చేశారు.
జిల్లా నుంచి అరుణకుమారి, నీరజాసుబ్రహ్మణ్యం
విజయవాడలో ప్రత్యేక శిక్షణ
జి.సిగడాం/శ్రీకాకుళం కల్చరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపా ధ్యాయ అవార్డులు పొం దిన వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేం దుకు విద్యా శాఖ నిర్ణ యించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు పొందిన 29 మందికి ఎంపిక చేశారు. వీరిలో జిల్లాకు చెందిన కూర్మాన అరుణకుమారి (హెచ్‌ఎం, ఎంపీపీ స్కూల్ బూటుపేట, జి.సిగడాం), తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యం (హిందీ పండిట్, వరం హైస్కూల్, శ్రీకాకుళం) ఉన్నారు.
మూడు దశల్లో అంతర్జాతీయ శిక్షణ
ఎంపికైన ఉపాధ్యాయులకు ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద మూడు దశల్లో శిక్షణ ఇస్తున్నట్లు సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజె క్ట్ డైరెక్టర్ (ఎస్‌పీడీ) బి.శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో శుక్ర వారం ఈ శిక్షణా శిబిరం ప్రారంభం కాగా జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొదటి దశలో వారం రోజుల పాటు తుర్కు విశ్వ విద్యాలయం (ఫిన్‌లాండ్) సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. రెండో దశలో ఆగస్టు 17 నుంచి 26 వరకు ఈ ఉపాధ్యాయులు నేరుగా ఫిన్‌లాండ్‌లోని తుర్కు, రౌమా నగరాల్లో పర్యటించి అక్కడి వినూత్న బోధన, విద్యా విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. మూడో దశలో పాఠ శాలల్లో అమలు చేసే ప్రాజెక్టుల కోసం యూనివర్శిటీ ఆఫ్ తుర్కు ప్రొఫెసర్లు ఆన్‌లైన్ ద్వారా ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం చేస్తారు. ఈ సంద ర్భంగా అరుణకుమారి, నీరజా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తమ నైపు ణ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఇంతటి అవకాశం కల్పించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు, ప్రోత్సాహం అంది స్తున్న డీఈవో రవిబాబు, డిప్యూటీ డీఈవో ఆర్.విజయకుమారి, ఎంఈవోలు, హెచ్ ఎంలకు కృతజ్ఞతలు తెలి పారు. శిక్షణ లక్ష్యాలను నూరు శాతం సాధించి జిల్లాకు పేరు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.