Share News

రాష్ట్రస్థాయి గట్కా పోటీల్లో 28 బంగారు పతకాలు

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:07 AM

ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19, 17 గట్కా పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 28 బంగారు పతకాలు సాధించారు.

రాష్ట్రస్థాయి గట్కా పోటీల్లో 28 బంగారు పతకాలు
జాతీయస్థాయి పోటీలకు ఎంపికై జిల్లా క్రీడాకారులు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19, 17 గట్కా పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 28 బంగారు పతకాలు సాధించారు. జిల్లా నుంచి 31 మంది బాలబాలికలు పాల్గొనగా 14 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్‌-19 విభా గంలో జాతీయ జట్టుకు 16 మంది ఎంపిక కాగా వారిలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు 8 మంది ఉన్నారు. ఈ పోటీలు పంజాబ్‌ రాష్ట్రం లూథియానాలో ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు బీవీ రమణ, ఆర్‌.స్వాతి, గట్కా సంఘం జిల్లా అధ్యక్షుడు ఖగేశ్వరరావు, కార్యదర్శి హర్షవర్థన్‌, శ్యామ్‌ సుందర్‌, ఎస్‌.సురేష్‌ అభినందించారు.

జాతీయ వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో ఆదివారం(4వ తేదీ) నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న 72వ సీనియర్‌ నేషనల్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. రణస్థలం మండలం కొవ్వాడ మత్స్య లేశానికి చెందిన మైలపల్లి సత్యం, కవిటికి చెందిన మరిడి సుధీర్‌ కుమార్‌ రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభిమానులు అభినం దించారు.

Updated Date - Jan 04 , 2026 | 12:07 AM