26 కేజీల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - May 22 , 2026 | 12:00 AM
ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో 26 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమదాలవలస, మే 21(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో 26 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశా రాష్ర్టానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ మేరకు గజపతి జిల్లా నుంచి విశాఖపట్నం గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. గజపతి జిల్లాకు చెందిన సిద్దాంత మాలిక్, మిశ్ర రైతుతో పాటు వీరికి ఒడిశాలో గంజాయి సరఫరా చేసిన అజయ్ మాజీలపై ఎస్‌ఐ కాంతారావు కేసు నమోదు చేశారు. ఈ మేరకు 26 కేజీల గంజాయి సీజ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.