19 మంది ఎస్‌ఐలకు స్థానచలనం
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:46 PM
Transfors in police department జిల్లా పోలీస్‌శాఖలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం రేంజ్ పోలీస్ బోర్డు సిఫారసుల మేరకు పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం 19 మంది ఎస్‌ఐలకు స్థానచలనం చేశారు.
శ్రీకాకుళం క్రైం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్‌శాఖలో పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం రేంజ్ పోలీస్ బోర్డు సిఫారసుల మేరకు పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం 19 మంది ఎస్‌ఐలకు స్థానచలనం చేశారు. ఇందులో వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉన్నవారికి, ఇప్పటికే ఆయా సబ్‌స్టేషన్లలో అటాచ్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న వారికి రెగ్యులర్ పోస్టింగ్‌లు ఇవ్వగా, మరికొందరికి ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు తక్షణమే విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.
స్టేషన్ల మార్పు ఇలా...
ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ను జి.సిగడాం స్టేషన్‌కు బదిలీ చేశారు. లావేరు ఎస్‌ఐ జి.లక్ష్మణరావును ఎచ్చెర్ల ఎస్‌ఐగా నియమించారు. జి.సిగడాం ఎస్‌ఐ వై.మధుసూదనరావును శ్రీకాకుళం టూటౌన్(లాఅండ్ ఆర్డర్-1) ఎస్‌ఐగా, మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కె.లక్ష్మీని శ్రీకాకుళం టూటౌన్ (లాఅండ్ ఆర్డర్-2) ఎస్‌ఐగా బదిలీ చేశారు.
వీఆర్‌లో ఉన్న కె.అప్పలసూరిని లావేరు ఎస్‌ఐగా నియమించారు. బి.మోహినిని సోంపేట ఎస్‌ఐగా, వి.హేమంత్ కళ్యాణ్‌ను హిరమండలం ఎస్‌ఐగా, బి.గణేష్‌ను నరసన్నపేట ఎస్‌ఐగా నియమించారు.
వివిధ పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే అటాచ్‌మెంట్‌లో ఉంటూ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలకు అదేస్టేషన్లలో రెగ్యులర్ ఎస్‌ఐలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. కె.వెంకటేష్ - కొత్తూరు, ఆర్.జనార్దనరావు - ఇచ్ఛాపురం రూరల్, ఎస్.బాలరాజు - ఆమదాలవలస, బి.హైమావతి - సరుబుజ్జిలి, కె.మధసూదనరావు - పాతపట్నం, ఆర్.నరసింహమూర్తి - కాశీబుగ్గ (ఎస్‌ఐ-2), వై.సింహాచలం - సంతబొమ్మాళి, పి.పారినాయుడు - కంచిలి, ఎం.ముకుందరావు - ఇచ్ఛాపురం టౌన్, ఎస్.రవివర్మ -కవిటి, బి.లావణ్య -శ్రీకాకుళం మహిళా పోలీస్‌స్టేషన్‌కు నియమించారు.